ప్రముఖ రేడియో హోస్ట్ హ్యూ హెవిట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేశారు. “సాధారణంగా ఇరాన్లో అల్లర్లు జరిగినప్పుడు అక్కడి పాలకులు ప్రజలను పొట్టనబెట్టుకోవడానికి వెనకాడరు. కానీ ఈసారి అలా జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పటికే ఆ దేశాధికారులకు నా హెచ్చరికలు చేరాయి. ప్రజలను చంపడం మొదలు పెడితే.. మేము వారిని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు.

