అమెరికాలో దారుణం జరిగింది. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు మారణహోమం సృష్టించారు. వలసదారులపై కాల్పులకు తెగబడ్డారు. బుధవారం మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ లో ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఫెడరల్ ఏజెంట్లు రంగంలోకి దిగి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్.. కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాయి. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతి తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.

