అమెరికా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ‘డ్రీమ్ మిలిటరీ’ నిర్మాణం కోసం భారీగా నిధులను వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. 2027 ఆర్థిక సంవత్సరానికి గానూ సైనిక బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.135 లక్షల కోట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా రక్షణ బడ్జెట్ 1 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, దీనిని ఏకంగా 50 శాతం పెంచుతున్నట్లు ఆయన వెల్లడించడం సంచలనంగా మారింది.

