కబ్జాలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు సీక్రేట్ లేక్‌గా పేరుగాంచిన దుర్గంచెరువును కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపిస్తోంది. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను హైడ్రా తొలగించింది. వాహనాల పార్కింగ్ కోసం వినియోగించి ప్రతి నెలా రూ. 50 లక్షల వరకూ అద్దెలు వసూలు చేస్తున్న దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్కడి వాహనాలను ఖాళీ చేయించి ప్రస్తుతానికి ఫెన్సింగ్ వేసింది. తర్వాత మట్టిని తొలగించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది.

