2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో బిజెపి మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సెంగార్‌కు విధించిన జీవిత ఖైదును నిలిపివేసి, బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై విచారించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, జస్టిస్‌లు జె.కె. మహేశ్వరి, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన వెకేషన్ బెంచ్.. ఈ విషయంపై పరిశీలన అవసరమని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సెంగార్‌ను కస్టడీ నుండి విడుదల చేయొద్దని వెల్లడించింది.

