ఆడియో లాంచ్ కార్యక్రమం ముగించుకుని మలేషియా నుంచి విజయ్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న సమయంలో ఆయన కోసం భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అభిమానులు ఒక్కసారిగా విజయ్‌ని చుట్టుముట్టడం, ఆ గందరగోళంలో కారు ఎక్కుతుండగా, ఒక్కసారిగా స్లిప్ అయి పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటనలో విజయ్‌కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు
అత్యధిక ప్రేక్షకులు పాల్గొన్న ఆడియో లాంచ్‌గా ఇది మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

