రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టిఎస్ఎల్పిఆర్బి)నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు పోస్టుల వివరాలు వెల్లడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్లోట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ(టిఎస్టి), మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ (ఎంఎస్టి) పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీకి 84 ఖాళీలు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీకి 114 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. www.tgprb.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

