అల్లర్లతో రగులుతున్న బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు. అతడు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఆ దేశ పోలీసులు ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంగ్షా గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమృత్ మండల్ డిసెంబర్ 24న రాత్రి 11 గంటల సమయంలో డబ్బుల వసూలు కోసం గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం ఇంటికి అనుచరులతో కలిసి సామ్రాట్ వెళ్లినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఆ కుటుంబం దొంగలని అరవడంతో స్థానికులు సామ్రాట్‌పై దాడి చేసినట్లు పేర్కొంది.

