క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినమని అన్నారు. కరుణామయుడు చూపిన ప్రేమ, శాంతి, సహనం పాటిద్దామని పేర్కొన్నారు. సమాజహితానికి పాటుపడదామని.. సుఖసంతోషాలతో అందరూ ఆనందమయంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఏసు ప్రభువును ప్రార్థిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

