క్రిస్మస్ సందర్భంగా కాల్పుల విరమణకు రష్యా నిరాకరించడంపై పోప్ లియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాంతి, మానవతా విలువలకు ఇది విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన అసిస్టెడ్ డైయింగ్ చట్టంపై కూడా పోప్ లియో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్టం మానవ జీవన పవిత్రతను ప్రశ్నార్థకం చేస్తోందని, ప్రభుత్వాలు మానవ జీవితాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

