అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ తీరుపై మరోసారి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కాష్ పటేల్, తన ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ తో కలిసి కన్జర్వేటివ్ పాడ్ కాస్టర్ కేటీ మిల్లర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఒకవైపు బ్రౌన్స్ యూనివర్సి టీలో కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్న సమయంలో ఆయన పాడ్ కాస్టర్ లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం తీవ్రమైన నేరంతో పోరాడుతుంటే ఆయనకు సమయం దొరికిందా? అని దుమ్మెత్తిపోస్తున్నారు.

