ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. జోర్డాన్ పర్యటన ముగించుకొని ఇథియోపియా వెళ్లారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఇథియోపియాను సందర్శించిన భారత ప్రధానికి అరుదైన స్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఆదేశ ప్రధాన మంత్రి అబీ అహ్మద్ నిర్వహించిన విందులో ఇథియోపియా గాయకులు వందేమాతరం ఆలపించారు. ఈ గీతంతో మోదీకి స్వాగతం పలికారు. దీంతో ప్రధాని పులకరించిపోయారు. చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు.

