జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ, హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పోస్టుల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని మెటా, గూగుల్, ఎక్స్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

