హనుమకొండ కార్యాలయంలో వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి గత రెండేళ్ల నుంచి అడిషనల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల హనమకొండ డిఇఓ బదిలీపై వెళ్లడంతో ఇన్చార్జి డిఇఒగా అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఒక ఫైల్ క్లియరెన్స్ అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో ఓ వ్యక్తి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.