హిల్ట్ పాలసీపై విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిప్పికొట్టారు. గత ప్రభుత్వంలో కోకాపేట, నియోపోలిస్ ప్లాట్లు వేలం వేశారు, హిల్ట్‌ను దోపిడీ పాలసీ అంటున్న కేటీఆర్‌కు ఇవి గుర్తులేవా అని మండిపడ్డారు. ఓఆర్ ఆర్ నిర్వహణను కూడా వేలం వేశారు. పరిశ్రమల శాఖ మంత్రిగా వారి దగ్గర ముడుపులు తీసుకొని భూములను కన్వర్షన్ చేశారని, ఎల్‌బి నగర్‌లోని40 ఎకరాల స్ధలాన్ని పివి రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇవ్వడం జరిగింది. ఈ కెమికల్ ఇండస్ట్రీని రెసిడెన్షియల్ జోన్‌గా మార్చింది బిఆర్ఎస్ పార్టీనేనన్నారు.