ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేపీకి 7 స్థానాలు దక్కగా, ప్రతిపక్ష ఆప్ (AAP) 3 స్థానాల్లో గెలిచింది. ఇక కాంగ్రెస్ ఒక్క స్థానంలో
మాత్రమే విజయం సాధించింది. ఇక మిగిలిన 12వ స్థానాన్ని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 250 స్థానాలకుగాను బీజేపీకి 122 , ఆప్‌కు 102 . ఇక కాంగ్రెస్ సీట్ల సంఖ్య 9 కి పెరిగింది.

