జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బిజెపికి ప్రత్యామ్నాయం దేశానికి అందించలేకపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. శివ్ నాడార్ ఫౌండేషన్ ఇగ్నిషన్ సదస్సులో కెటిఆర్ మాట్లాడుతూ
రాహుల్ గాంధీ వల్లే మోడీ ఇంకా ఎన్నికల్లో గెలుస్తున్నారని, బిజెపి మత రాజకీయాలు చేస్తుందని, రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక్క ప్రతిపాదనను కూడా రాహుల్ గాంధీ నుండి వినలేదని అన్నారు.

