కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఊహాగానాల వేళ బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారం వేళ రెండు రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య నివాసానికి డిప్యూటీ సీఎం
డీకే శివకుమార్ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు డీకే ఇంటికి సీఎం సిద్ధూ బ్రేక్‌ఫాస్ట్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఇంటికి వచ్చిన సీఎంకు డీకే ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. బ్రేక్‌ఫాస్ట్ మీట్‌లో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

