ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో కారులో పేలుడు సంభవించడంతో ఇప్పటివరకు 12 మంది దుర్మరణం పాలయ్యారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ పేలుడు ఘటనతో ఇస్లామాబాద్ ఒక్కసారిగా వణికిపోయింది. ఈ భారీ పేలుడు ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు వెల్లడించారు. దీంతో వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సరిగ్గా ఆ పేలుడు సంభవించిన ప్రాంతం సాధారణంగా విచారణలకు వచ్చిన సందర్శకులు, లాయర్లు, కోర్టు సిబ్బంది, పోలీసులతో రద్దీగా ఉంది.

