అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించిన సరిగ్గా 40 రోజులైంది. ప్రభుత్వ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. డెమోక్రటిక్ సెనేటర్లు జీన్ షాహీన్, మ్యాగీ హసన్.. రిపబ్లికన్ లీడర్ జాన్ థూన్, వైట్‌హౌస్ ప్రతినిధులతో కలిసి వారాంతంలో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ బిల్లు ప్రకారం చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జనవరి వరకు నిధులు అందుతాయి. షట్‌డౌన్ కారణంగా ప్రభావితమైన ఫెడరల్ ఉద్యోగులందరికీ బకాయిపడ్డ జీతాలను చెల్లించేందుకు హామీ ఇచ్చారు.

