పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. మనది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. ద్రవ్యోల్బణం లేదు. స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు. సుంకాల ద్వారా మనకు లక్షల డాలర్లు వస్తున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ డాలర్లు రుణాన్ని చెల్లించడం మొదలుపెడతాం. డెవిడెండ్ కింద ఒక్కో అమెరికన్‌కు రెండు వేల డాలర్లు చెల్లిస్తాం’ అని ట్రంప్ పేర్కొన్నారు

