బీహార్లో తొలి దశ పోలింగ్ వేళ హింస చెలరేగింది. బీహార్ డిప్యూటీ సీఎం, లఖిసరాయ్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి జరిగింది. విజయ్ కుమార్ సిన్హా తన నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్న సమయంలో కొందరు ఆయన కారును అడ్డుకునే యత్నం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్గా మారింది. ఇందులో కొందరు జనాలు చెప్పులు విసరడంతో పాటు, “ముర్దాబాద్” నినాదాలు చేయడం కనిపించింది.

