‘వ్యవసాయం దండగ అన్న సీఎం చంద్రబాబు అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో దాదాపు 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, దాంతో రైతులకు నష్టం కలుగుతోందని,
అయినా ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలా లేదు’అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు తుపాన్లో నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని, రైతులకు అండగా వైసీపీ నిలుస్తుంది’ అని వైఎస్ జగన్ తెలిపారు

