కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. నయనిక రెడ్డి హైదరాబాద్ కి చెందిన అమ్మాయే. ఆమె బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరికి చాలా రోజులనుంచి పరిచయం ఉండడం, అది ప్రేమగా మారడం జరిగింది. ఈ వేడుకకి అల్లు ఫ్యామిలీతో పాటు.. చిరంజీవి సురేఖ దంపతులు, రాంచరణ్ ఉపాసన దంపతులు, నాగబాబు పద్మజ దంపతులు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు.

