మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఫిక్సరేనని బజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అజహరుద్దీన్‌ను భారత దేశ క్రికెట్ కెప్టెన్‌గా చేస్తే, ఆయన దేశం కోసం కాకుండా డబ్బుల కోసం కక్కుర్తితో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లు మాత్రమే కావాలి కానీ వారి బాగోగులు పట్టించుకోదని రెండేళ్ళుగా మంత్రివర్గంలోకి మైనారిటీ నాయకునికి ప్రాతినిథ్యం ఎందుకు కల్పించ లేదని ఆయన ప్రశ్నించారు.

