జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనమని చెప్పారు. అందుకే కాంగ్రెస్, దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్
ఉపఎన్నిక సరైన వేదిక అని చెప్పారు. ఈమేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

