అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు. దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చైనాకు ట్రంప్ గుడ్న్యూస్ చెప్పారు. చైనాపై విధించిన టారిఫ్లను 10శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. బుసాన్లో దాదాపు రెండు గంటల పాటూ జరిగిన భేటీలో పలు అంశాలపై ఇరువురూ చర్చించారు.

