
ఏపీలో మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ము, ధైర్యముంటే తనకు లై డిటెక్టర్ ( Lie detector) చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్ చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎలాగైనా జైలులో ఉంచాలనే దురుద్దేశ్యంతో తనపై తప్పుడు కేసులు బనాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న అద్దెపల్లి జనార్ధన్‌తో టీడీపీ కుమ్మకై వైసీపీ నాయకులపై కుట్రలు పన్నుతుందని పేర్కొన్నారు.