
విజయవాడ బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా చిరు, వీధి వ్యాపారులతో సరదాగా ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ సంస్కరణల అనంతరం వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు. జీఎస్టీ తగ్గింపుతో తగ్గిన ధరల మేరకే వస్తువులను ప్రజలకు విక్రయిస్తున్నారా? అని సీఎం అడిగి తెలుసుకున్నారు. బీసెంట్ రోడ్డులో దీపావళి ప్రమిదలు విక్రయిస్తున్న మహిళతో మాట్లాడిన సీఎం.. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు.