‘నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా, నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెపుతున్నా’ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి రాద్దాంతం జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. అబద్ధానికి ఆరడుగుల సాక్ష్యం హరీష్ రావు అంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలోనే రోడ్లపై అడ్వకేట్లను చంపింది బీఆర్ఎస్ నేతలేనని అన్నారు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనేనని మండిపడ్డారు.

