వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కి ఊరట లభించింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి షరతులతో కూడిన అనుమతిని విజయవాడ ఏసీబీ కోర్టు జారీ చేసింది. రూ.50,000 విలువచేసే రెండు జామీన్లను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్లో ఎక్కడ బస చేస్తున్నారనే వివరాలను అందజేయాలని ఆజ్ఞాపించింది న్యాయస్థానం. మిథున్ రెడ్డి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లను కోర్టుకు వెంటనే తెలియజేయాలని ఆదేశించింది.

