అమెరికాలో ప్రభుత్వం విధించిన షట్ డౌన్ మూడో వారం కొనసాగుతుంది. ఈ కారణంగా.. అమెరికా అధ్యక్ష భవనంలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 10 వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్, బడ్జెట్ చీఫ్ రసెల్ వోట్ వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీతో జతకట్టిన కార్మికులను లక్ష్యంగా చేసుకుని భారీగా తొలగింపులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించిన విషయం విదితమే.

