రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ అనేది మోదీ యుద్ధమే’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. రష్యా ముడి చమురును భారత్ కొంటున్నందు వల్లే మాస్కో నేటికీ ఉక్రెయిన్ తో యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని ఆయన అన్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రజలపైనా భారం పెరిగిందన్నారు పీటర్. రష్యా-ఉక్రెయిన్ శాంతిమార్గంలో కనీసం కొంతభాగం న్యూఢిల్లీ మీదుగా వెళ్తుందని పీటర్నవారో పేర్కొన్నారు.

