సోమవారం అహ్మదాబాద్ లో రూ.5,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి పరోక్షంగా స్పందించారు. ‘ఎంత ఒత్తిడి వచ్చినా.. రైతులకు హాని జరగనివ్వం’ అని చెప్పారు. నేడు ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ అహ్మదాబాద్ గడ్డ మీద నుంచి చెబుతున్నా.. మీ ప్రయోజనాలు మోడీకి అత్యంత ముఖ్యమైనవి. అని చెప్పారు.

