శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నాలుగు కంటైనర్లలో ముంబయి నుంచి చెన్నైకి ఒక ప్రముఖ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు తరలించబడుతున్నాయి.అయితే అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద ఒక్క కంటైనర్లోని అలారం అకస్మాత్తుగా ఆఫ్ అయింది. కంపెనీ వారు వెంటనే స్పందించారు. కానీ అప్పటికే లారీ డ్రైవర్ మరియు క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. కంపెనీ ప్రతినిధులు మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ల్యాప్టాప్ల మొత్తం విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని అంచనా.

