శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డారని, దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తన సొంత పార్టీ కార్యకర్తను వేధించారని, అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక మహిళా ప్రిన్సిపల్‌ను వేధించారని వైసిపి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ముగ్గురు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

