శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి తన దగ్గరకి వస్తే సిఫార్సు లేఖ ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. వివిధ సమస్యలతో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారు. అందులో భాగంగానే తాను పెరోల్ సిఫారసు లేఖ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. తాను, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ ఇచ్చిన లేఖలను తిరస్కరణకు గురైనట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

