ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, సీసీటీవీ ఫుటేజీ ఇవ్వడానికి ఎన్నికల సంఘం (EC) నిరాకరించడంపై ప్రకాశ్ రాజ్ తన పోస్ట్‌లో ఈసీ వాదనను తీవ్రంగా ఖండించారు. “పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టే ముందు మీరు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్‌లు కావు” అని ఆయన ప్రశ్నించారు. ఈసీ చెప్పే సాకులు తమకు ఆసక్తి లేవని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత కావాలని ఆయన స్పష్టం చేశారు.

