ఐర్లాండ్‌లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలికపై జాత్యహంకార దాడి జరిగింది. బాలికపై ఆమె ఇంటి సమీపంలో కొందరు దుండగలు దారుణంగా దాడి చేసి.. “భారతదేశానికి తిరిగి వెళ్ళిపో” అంటూ బెదిరించారు. చిన్నారి ప్రైవేట్ భాగాలపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు కొంతమంది అబ్బాయిలు, ఎనిమిది సంవత్సరాల వయస్సు గల ఓ అమ్మాయి దాడి చేసినవారిలో ఉన్నారని తెలిపింది.

