హైదరాబాద్ లో దాదాపు రెండుమూడు గంటలు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ప్లైఓవర్లపై వాహనాలు నిలిచిపోయాయి. అటు పాతబస్తీ నుండి ఇటు హైటెక్ సిటీ వరకు… సికింద్రాబాద్ నండి సిటీ ఔట్ స్కట్స్ వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో 151 మిల్లిమీటర్లు, బంజారాహిల్స్ లో 125 మి.మీ, జూబ్లీహిల్స్ లో 74 మి.మీ, మెహదీపట్నంలోబ 53 మి.మీ, ఖైరతాబాద్ లో 36 మి.మీ, మైత్రివనంలో 34 మి.మి వర్షపాతం నమోదయ్యింది.

