“కేసీఆర్ డిజైన్లు మార్చడం వల్లే ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఘోష్ కమిషన్ తేల్చిందని” ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లోనే సమస్య ఉందని కమిషన్ నివేదికలో స్పష్టంగా
పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, రుణాలు తీసుకోవడంలోనూ కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ నివేదికలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావన తొమ్మిది సార్లు ఉందని ఆయన వెల్లడించారు.

