భాను ప్రకాశ్ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యల ప్రకారం రోజా కుటుంబం ప్రభుత్వ అధికారాన్ని వాడుకొని బియ్యం మరియు ఇసుక అక్రమ రవాణాలో పాల్గొనిందని, గంజాయి దందా లోనూ వారి ప్రమేయం ఉన్నట్లు తనకు సమాచారం ఉందని, నిజం తేలితే “మెడ పట్టుకుని లాక్కెళ్లి జైలుకు వెళతారు” అని తీవ్రంగా హెచ్చరించారు. తమపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా తాము వెనక్కి తగ్గబోమని భాను ప్రకాశ్ స్పష్టం చేశారు.

