జనసేనకు చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో పనిచేస్తున్న గోపాల్ సింగ్ అనే వ్యక్తి మచిలీపట్నం వైద్య కళాశాల, కృష్ణ యూనివర్సిటీ, విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్సిస్తానని ఒక్కొక్కరి వద్దా 1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. మొత్తం వంద మంది బాధితుల నుంచి కోటిన్నర వరకూ గోపాల్ సింగ్ వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

