తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆనర్హత అంశంపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే.. అక్టోబర్ 31 లోగా స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో ఈ కేసును విచారించిన జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం, స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చెయ్యడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

