యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ ఎపిసోడ్లో ట్విస్ట్ ఇది. హత్య కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్ ప్రభుత్వం అంగీకరించిందని వార్తలు వచ్చాయి. అయితే ఉరిశక్ష రద్దును ప్రభుత్వవర్గాలు ధృవీకరించలేదు. ఈ వార్తలు సరికావంటుని విదేశాంగ శాఖ అధికారులు అంటున్నారు. నిమిష ప్రియ మరణశిక్షను రద్దయినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం అబూబకర్ ముస్లియార్ ఆఫీస్ సోమవారం ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి.

