పార్లమెంట్ వర్షాకాల సమావేలు ఇవాళ ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తనను మాట్లాడనివ్వట్లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సమావేశాల్లో అధికార పక్షం పక్షపాతంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడటానికి అనుమతి ఇచ్చారని.. తనకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.

