గతంలో అష్టఐశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం.. ఈ రోజు చాలా పేదరికంలో ఉంది.. అప్పులపాలయ్యాం.. నా కారు కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. ప్రస్తుతం నా అల్లుడి కారు వాడుతున్నా..అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటిది కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసని.. మనందరికీ మంచి రోజులు వస్తాయని బత్తుల బలరామకృష్ణ చెప్పుకొచ్చారు. అయినా నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

