ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. దాడి సమయంలో మల్లన్న కార్యాలయంలోనే ఉండగా..
ఆయన గన్మెన్లు రక్షణగా నిలిచారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పలువురికి గాయాలయ్యాయి.

