అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రాత్రి సమయంలో చికాగో లోని ఓ నైట్‌క్లబ్‌లో చొరబడిన కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సుమారు నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. చికాగోలోని రివర్ నార్త్ పరిసరాల్లో గల ఆర్టిస్ లాంజ్ నైట్‌క్లబ్ వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

