రాజమౌళి ఓ వీడియో గేమ్‌లో ప్రత్యక్షమయ్యారు. వీడియో గేమ్‌లు ఇష్టపడే అందరికీ హిడియో కోజిమా సుపరిచితమే. ఆయన రూపొందించిన సూపర్ సక్సెస్ గేమ్ డెత్ స్ట్రాండింగ్ సెకండ్ వెర్షన్‌లో రాజమౌళి, కార్తికేయ కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డెత్ స్ట్రాండింగ్ 2లో హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్‌లు భాగం కాగా.. వారితో పాటు రాజమౌళి, కార్తికేయ కూడా కనిపించనున్నారు. ఈ గేమ్ జూన్ 26 నుంచి పూర్తిగా అందుబాటులోకి రానుంది.

